మాకు చిన్నప్పుడు సంక్రాంతి కంటే పెద్ద పండుగ అంటేనే తెలుసు. సంక్రాంతి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవాళ్ళం. కొత్తబట్టలు కొనిస్త్రారని, బోలెడు పిండివంటలు చేస్తారని ఆశ. పిల్లలకి ఆ మూడు రోజుల్లో బాగా నచ్చేది భోగి పండుగ. భోగి కోసం నెల రోజుల ముందునించి (బలిజకంప) ముళ్ళకంప, తాటాకులు, పిచ్చిచెట్లు(అదో రకమైన చెట్లు) సేకరించేవాళ్ళం. అందరికంటే మా ఇంటి బోగే పెద్దగా ఉండాలని అందరి ఆశ. వీటి కోసం జట్లు, జట్లు గా పొలాలలోకి వెళ్ళేవాల్లం. ఒకరు కత్తితో కొడుతుంటె ఇంకొకకరు వాటిని తాళ్ళతో కట్టేవాళ్ళు. ఆశతో మేము మోయలేనత గ కట్టుకునేవాళ్ళం. ఇక వచ్చేటప్పుడు చూడాలి అవి మోయలేక కిందపడుతూ, మీదపడుతూ ఎలాగో ఇంటికి చేరుకునే వాళ్ళం.
మాకు ఇంకో ప్రధానాంశం అప్పచ్చులు(పిండివంటలు) సంక్రాంతికి ఓ వారం రోజులముందు నించే హడావుడి మొదలయ్యేది. ప్రతి ఇంట్లో రోకల్లమోత మొదలయ్యేది. మొదట బియ్యాన్ని రోజంతా నానబెట్టేవాళ్ళు తరువాత పెద్ద పెద్ద రోకల్లతో దంచేవాళ్ళు. ఇద్దరు దంచుతుంటే, ఒకరు జల్లెడ పడుతు, ఇంకొకకరు రాళ్ళతో పొయ్యిని చేసేవారు. పిండిమర ఉన్నా కాని అరిసెలు కోసం అందరూ దంచేవాళ్ళు. ఇల్లపక్కలవాళ్ళు ఒకరికి ఒకరు సాయంగా వుండేవాళ్ళు. అబ్బో ఎన్ని పిండివంటలో ఏ పండక్కి చేయనన్ని చేసేవాళ్ళు. అరిసెలు ( వీటినే కొన్ని ప్రాంతాల్లో నిప్పట్లు అని , అత్తరాసులు అని అంటారు ), మనుగుపూలు (వీటినే వీటినే కొన్ని ప్రాంతాల్లో చక్రాలు అని, కారాలు అని, మురుకులు అని అంటారు ), ఉప్పు చక్కలు, కజ్జికాయలు ఇలా ఎన్నో పిండివంటలు. అరిసెలు, మనుగుపూలు, చెక్కలు అందరి ఇల్లలో కచ్చితంగా చేస్తారు. మిగిలినవి ఎవరి ఇస్టాన్ని బట్టి, తాహతుని బట్టి చేసుకుంటారు. మేమయితే పిండిమరల చుట్టూ, దర్జీల చుట్టూ తిరిగేవాళ్ళం.
ఆరోజుల్లో పండుగ జనవరి 13,14,15 వచ్చేది ప్రతి సంవత్సరం. అసలు 12 రాత్రి నిద్రపట్టేది కాదు. ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు భోగి వేసి, భోగిస్నానం చేసి కొత్తబట్టలు వేసుకుంటామా అని ఆత్రుతగా ఎదురు చూసేవాళ్ళం. 13 వ తేది తెల్లవారు జామున 4 గంటలకే అందరు భోగి వేయటం మొదలుపెట్టేవాళ్ళు ఒక్కో ఇంటిముందు పెద్దమంటలు, ఇంట్లో వున్న పాత వస్తువులన్నీ వేసేవాళ్ళు. ఇక పోటీలు ప్రారంభం ఆ వీధిలో ఎవరికి వారే మా భోగి మంటే పద్దదిగ వుండాలని ఆకులు, కంప పెద్ద ఎత్తున వేసేవాళ్ళం. ఆ మంటలోనే ఓ కుండలో నీల్లు పెట్టేవాళ్ళు. మంట ఇక చివరకి వచ్చేసరికి తేగలు (మొలక ఎత్తిన తాటిపళ్ళు) వేసేవాళ్ళం మంటలో. ఇక వాటిని మాడిపోకుండా, ఒక్కటి కూడ వదిలేయకుండా బయటకి తీయడం పెద్ద కళ. ఆ తరువాత ఆ భోగి కుండలో నీళ్ళతో స్నానం చేసేవాళ్ళం. ఇక కాసేపు ఆగమన్నా ఆగకుండా కొత్తబట్టలు వేసుకొని దోస్తులని కలవడానికి వెళ్ళేవాళ్ళం. ఆ తరువాత ఒక్కో ఇంటిముందు రంగులతో దిద్దిన ముగ్గులు చూస్తు వాటిని ఆస్వాదిస్తూ అన్నీ వీధులు తిరిగేవాళ్ళం.
ఈ ప్రపంచమే మనకు బడి. ప్రతి రోజూ క్రొత్త విశయాలు నేర్చుకుంటూనే వుంటాము. మన అనుభవాలు పంచుకుంటూ వుంటాం. నేను నా అనుభవాలు, అలోచనలు, ఊహలు, ఊసులు ఇంకా ఎన్నో మీతో పంచుకోవాలని ఈ వేధికనెక్కాను...... నా బలం, బలగం అన్నీ మీ అభిప్రాయాలే...
Friday, December 24, 2010
Saturday, May 22, 2010
మా మాలకొండ
నా సైకిలు యాత్రలకు అవరోదం కలిగి చాలాకాలమయింది. ఎవరో కుళ్ళుకున్నారు కొంత కాలం విరామం తరువాత మళ్ళీ పధకం వేసాను. ఈ సారి మాలకొండ అది కావలి నించి 70 కి.మీ. ఇది ప్రకాశం జిల్లా, వలేటివారిపాలెం మండలం లో వుంది, ఇక్కడ శ్రీ లక్ష్మినరసింహ స్వామి నెలకొనివున్నాడు. ఇక్కడ మాల్యాద్రిగా పిలవబడుతున్నాడు అందుకే ఈ కొండకి మాలకొండ అని పేరు వచ్చింది. కొండమీద కోనేరు కూడ ఉందంట. ఎప్పుడు చూడలేదు అందులో సైకిలు ప్రయాణం చేసి చాలాకాలం అయింది. ఇక తోడు కోసం వెతకాలి. ఎలాగో మిగిలినవాళ్ళని కూడా పట్టుకున్నాను సైకిలు ప్రయాణం చేసి చాలా కాలం అయింది. ఇక తోడు కోసం వెతకాలి. ఎలాగో మిగిలినవాళ్ళని కూడా పట్టుకున్నాను.
మొత్తానికి ప్రయాణం ఖరారయింది. ఇంతకూ మన హీరోలను పరిచయం చెయ్యలేదు కదూ? సనత్, ప్రసాద్, పులి (రామకృష్ణ). అప్పటికి నేను మార్గదర్శి లో చేరా నేనూ ఒక సైకిలు కొనుక్కున్నా. సనత్ కి, ప్రసాద్ కి సైకిల్లు వున్నాయి పులికి మాత్రం లేదు బయట అద్దె సైకిలు తీసుకొని పులికి సమర్పించాము. అందరు వాళ్ళ ఇల్లలో వాళ్ళకు తోచిన వంటకాలు చేయించుకొని యుద్ధానికి సిద్దమయిన సైనికుల్లా బయలుదేరారు. నేను సేమియాఉప్మా, ప్రసాద్ పెరుగన్నం, సనత్ పులిహోర ఇంకా పులికి వీలుపడదు కాబట్టి ఏంలేదు.
ఉదయాన్నే బయలుదేరాలి అనుకున్నాం కాని సహజంగా 10:30 అయిపోయింది. జోరుగా మొదలయ్యింది యాత్ర మొదటి మజిలి పెద్దపవని ఎండ బాగా ఎక్కువగా వుంది. కొంచం నీల్లు తాగి మళ్ళీ బయలుదేరాము. రెండవ మజిలి కొండాపురం దగ్గర. అందరం పదార్ధాలు బయటకు తీసాం కొంచం ఉంచుకొని శుభ్రంగా తినేసి మళ్ళీ బయలుదేరాం తిన్నగా వెలితే మమ్మల్ని కోతులని ఎందుకు అంటారు. త్వరగా వెళ్ళాలని ఏదొ అడ్డదారిలో వెళ్ళి చివరకు ఎక్కడో చిక్కుకుపోయాం. పొలాల్లో పనిచెసే అందరినీ అడుగుతూ మళ్ళీ ఎప్పటికో అసలు దారిలోకి వచ్చము. కొంచం సేపటికి రాళ్ళపాడు ప్రాజెక్ట్ చేరుకున్నాం. రాళ్ళపాడు పెద్ద చెరువు అక్కడ కాసేపు ఈతకొట్టి సరదా చేసి మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాం.
సాయంత్రం 5:30 కి మాలకొండ చేరాము. ఏదో జాతరలా ఉంది. అంతా హడావుడిగా వుంది. రోడ్డు పక్కన అంతా అంగళ్ళు, రంగులరాట్నాలు, ఓ పక్కన రకరకాల పాటలు వాతావరణం అంతా మంచి సందడిగా ఉంది. సైకిల్లు ఓ పక్కన పెట్టి మేమూ ఆ సందడిలో కలిసిపోయాం. నగరంలో ఎంత గడిపినా ఇంత హాయిని పొందలేము. ఇంతలో రాత్రి అయింది ఇక తిండమే కదా మిగిలింది, అందరం పులిహోర తిన్నాము. కొండమీదకు ఉదయం వెళ్దాం అనుకొని ఓ అరుగుని ఆశ్రయించాం. కబుర్లు చెప్పుకుంటూ అక్కడే పడుకున్నాం. కొంత సేపటికి మంచి వర్షం మొదలయ్యింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు చివరకి ఓ సత్రం కనిపించింది అక్కడకు వెళ్తే జనం ఒకరిపై ఒకరు పదుకొని నిద్రపోతున్నారు.
మేమూ వాళ్ళలో కలిసిపోయి అక్కడే పడుకున్నాం. ఉదయం లేచి వేపపుల్లలతో పళ్ళుతోముకొని పైకి బయలుదేరాం. నేను వాక్ మేన్ పెట్టుకొని పల్లెటూరి అమ్మాయిల దగ్గర బడాయి పోతున్నాను. చిన్న కొండ అది వాహనాలు వెళ్ళటానికి వీలుగా రోడ్డు సదుపాయం కూడా ఉంది. పైకి వెళ్ళి స్నానం చెయ్యాలంటే చాలామంది వున్నారు అందులో స్త్రీలు, పక్కనే ఇంకొక కొనేరు ఉంది అదికూడా జనాలతో నిండిపోయుంది. ఇక చేసేదిలేక ఓ ఉపాయం పన్నాం బనియన్లు అలగే వుంచి డ్రాయర్లతో స్నానం చేసి అన్నింటిని ఆరబెట్టి దర్శనానికి వెళ్ళాం. మాల్యాద్రి స్వామిని, లక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వచ్చేసరికి నా బనీన్ కనిపించలేదు అది చాలా మచింది ఇంకా నాకిష్టమైనది.
అప్పటికే బాగా ఆకలేస్తుంది అంతలో కావలి నించి మాకు తెలిసిన ఓ పెళ్ళి బృందం వచ్చింది వాళ్ళు తిని వెళ్ళమన్నారు ఇక ఎదురుచూస్తూ కూర్చున్నాము. ఎంతకూ వడ్డించరు ఇక ఆగలేక కావలి బయలుదేరాం. ఆకలికి ఎక్కడా ఆగకూడనుకున్నాము కాని పులి సైకిలికి పంక్చర్ అయింది సాయిపేట లో ఒక్క సైకిలు అంగడి మాత్రమే వుంది అది కూడా మూసేసి ఉంది. ఇక చూడాలి మా పని ఎలాగో అతని ఇల్లు తెలుసుకొని అతనిని బ్రతిమాలి చివరకు పంక్చర్ వెయించుకొని మళ్ళీ బయలుదేరాం పెద్దపవని వచ్చి నాదగ్గర 12/- ఉంటే అందరం సుగంధ వాటర్ తాగాము. కొంచం దూరం వచ్చి ఓ మామిడి తోటలో దూరాము అందరూ ఉన్నారు ఇంక దొంగతనము మాని దొరతనం గా ఉన్న 5 రూపాయలతో మామిడికాయలు కొని అవితిని సాయంత్రం 6 గంటలకు కావలి చేరాము బిక్క మొహాలతో. మొత్తం 130 కి.మీ ప్రయాణం ఓ అరగంట తప్ప అంతా సరదాగ గడిపాము, ఎప్పటికి మరిచిపోలేని అనుభూతిని పంచుకున్నాం.

కాటంరాజు జాతరలో కోతిమూక
నేను కంభంలో పాలిటెక్నిక్ చదివేటప్పుడు మా మిత్ర బృందానికి చిరునామా శ్రీ తిరుమల విలాస్. అందరం అక్కడే బోజనాలు చేసేవాళ్ళం. దానిని ఇద్దరు అన్నదమ్ములు కలిసి నడిపేవారు. వెంకటేశ్వర్లు అన్న మరియు పాండన్న. సాయంత్రమైతే మేమంతా అక్కడే వుండేవాళ్ళం. మాది చాలా పెద్ద గుంపు నేను, శ్రీకాంత్, రవీంద్ర, కిరణ్, శివ, సర్వేశ్వరరావు, అనంత్, సుబ్బుగాడు, నల్లకాలువ (శ్రీను), హెలికాప్టెర్ నారాయణ ఇలా చాలా మంది వుండేవాళ్ళం. అక్కడ ప్రతి మార్చి నెలలో వందలకొద్దీ బండ్లు, ట్రాక్టర్లు ఇంకా లారీలు బోలెడు జనాభాతో ప్రక్కన మనిషి కూడా కనిపించనంతగా దుమ్మురేపుకుంటూ పడమటి దిక్కుకి సాగిపోయేవి. మేమందరం పాండన్నకు సన్నిహితంగా వుండేవాళ్ళం. పాండన్నను అడిగితే అక్కడ శ్రీ కాటమ్మహారాజు తిరునాల జరుగుతుందని చాలా ఊర్లనించి జనాభా వస్తారని, చాలా బావుంటుందని చెప్పేసరికి అందరం వెళ్ళాలనుకున్నాం. మొత్తానికి మా చివరి సంవత్సరం అవకాశం వచ్చింది. పాండన్న వాళ్ళు అక్కడ టెంకాయల పాటపాడారంట. పాటంటే ఆ జాతరలో టెంకాయలు వాళ్ళు మాత్రమే అమ్మాలి. సహాయం కోసం పాండన్న మమ్మల్నందరిని పిలిచాడు దానికోసమే ఎదురుచూస్తున్న మేము అనందంగా బయలుదేరాము.
కోతిమూకలో, నేను, శ్రీకాంత్, సుబ్బుగాడు, నల్లకాలువ - వీడి అసలు పేరు వెంకటేశ్వర్లు కాని వాళ్ళ ఊరిపేరు నల్లకాలువ అందరం ఆపేరుతొనే పిలిచేవాళ్లం , అనంత్ ఇంకా పాండన్న బందువులు కొంతమంది కలిసి జీప్ లో బయలుదేరాం. అదంతా ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాల సరిహద్దులో వున్న ప్రదేశం, అంతా ఎర్రని మట్టి, రాళ్ళు, కొండలు ఇంకా పలుచని అడవి - ఇది నల్లమల అడవికి ఆరంభం. అడుగుపెడితే సింగరేని బొగ్గుకాల్చినట్టు బోలెదు మట్టి పొగలా లేచేది. దారి సరిగా ఉండదు అంతా కొండ రాళ్ళతో నిండిపోయుంటుంది. మేమైతే డబ్బాలో వేసిన గులకరాళ్ళలాగా ఆ జీప్ లో అటుఇటూ ఎగిరిపడుతున్నాము. జీప్ మొత్తం ఏదో వస్తువుని జాగ్రత్తగా కట్టినట్టు చిన్న రంద్రం కూడా లెకుండా అన్నీ కప్పేసారు అలా ఎదుకు చేసారో తెలియలేదు మాకు. మొత్తానికి సాయంత్రానికి అక్కడకు చేరుకున్నాం. అప్పటికే అక్కడ ఇసుకవేస్తె రాలనంత జనం. చాలా సంబరంగా వుంది మాకు పల్లెటూరి అమ్మాయిలు, రకరకలా ఆటలు, పాటలు, అంగల్లు ఇంకా రంగులరాట్నాలు అసలు ఆ ప్రదేశమంతా కోలాహలంగా ఉంది.
పాండన్న అక్కడ కొబ్బరి కాయల అంగడి పెట్టాడు అదీ వేలాం పాటపాడి. మన నల్లకాలువ మైకులో గమ్మత్తుగా మాట్లాడుతూ కొబ్బరికాయలు అమ్ముతున్నాడు. నేను శ్రీకాంత్ గాడు నాటు సారా ఎక్కడ దొరుకుతుందా అని వెతికే పనిలో పడ్డాము. అప్పటివరకు ఎవరకీ మందు అలవాటు లేకపోయినా ఆరోజు ఎలా అయినా తాగాలని ముందే అనుకున్నాం. అలా వెతికి, వెతికి అలసి మళ్ళీ మా గుడారానికొచ్చాం. అప్పటి వరకు మేము ఒక విషయం గుర్తించలేదు. అక్కడ ప్రతీ ఒక్కరి చేతిలో కర్రలున్నాయి. వాళ్ళలో దాదాపు అందరూ బాగ తాగేసి వున్నారు.

Tuesday, May 18, 2010
చోడవరంలో తోడుదొంగలు
నాకు చిన్నప్పటినించి ప్రయాణాలు చెయ్యాలని, క్రొత్తప్రదేశాలు తిరగాలని ఆశగా వుండేది కాని నాకు ఆ అవకాశం వుండేది కాదు. మొదటిది ఆర్ధిక సమస్య, రెండోది మా బందువులలో ఒకరికి, ఇంకొకరికి అంత సక్యత వుండేది కాదు అందులో అందరూ కావలిలోనే కాపురం ఇంకెక్కడికి వెళ్లను. అందుకే ఏదైనా సైకిలు దొరికితే ప్రక్కన వున్న పల్లెలు తిరిగేవాడిని. ఎంత సంతోషంగా వుండేదో ఆరోజు. అది నా అలవాటు ఏండాకాలం అంతా నాకు ఒక సైకిలు ప్రయాణాలే, ప్రయాణాలు.
ఆరోజు సొడారం ( చోడవరం ) కాని అందరూ అలాగే పిలిచేవాళ్ళు, కావలి నించి 30 కిలోమీటర్లు ఉంటుంది అక్కడకు వేశాను పధకం. నాతోపాటు శీనయ్య వస్తానన్నాడు. ఇద్దరం కలసి ఓ అద్దెసైకిలు తీసుకొని బయలు దేరాము, ఆ ఊరికే వెల్లటానికి కారణం అక్కడ మా బందువులు ఉన్నారు. వాల్ల ఇంటికి వెళ్ళాలని కాదు కాని మా వాళ్ళు వున్నారని. మా వాళ్ళు ఎక్కువసేపు సైకిలు తొక్కడానికి కష్టపడేవాళ్ళు కాని నాకు బాగా అలవాటు కదా అందుకే సహజంగా నేనే తొక్కేవాడిని.
అయినా అప్పుడు ఆకలి, అలసట అసలు తెలిసేది కాదు. చేతిలో ఒక్క పైసా కూడా లేకుండా ప్రయాణాలు చేసేవాళ్ళం, జేబులో ఓ రెండు రూపాయలు వుంటే అసలు ఆ సంతోషమే వేరు. అన్ని ఊర్లు చూస్తూ మధ్యాహాన్నానికి చోడవరం చేరాము. నా దగ్గర రూపాయి వుంది. అక్కడ ఓ అంగడిలో బిస్కెట్లు కొన్నాము .ఆ అంగడిలో ఓ అమ్మయివుంది శీనయ్యా, నేను తనను చూస్తు అక్కడే ఉన్నాము. అప్పటికి మాకు అంతగా ప్రేమ అలాంటివి తెలీదు ఎదో, పుస్తకపఠనం, ఇంకా సినిమా పరిఙ్ఞానం మాకు కొంత ( అ ) ఙ్ఞానాన్ని కలిగించాయి. తను వింతగా చూసి వెళ్ళిపోయింది పల్లెల్లో అంతేలే అనుకొని ఓ పాత గుడి కనిపిస్తే అక్కడకు వెళ్ళి కాసేపు ఆశక్తిగా అంతా చూసి వస్తుంటే చాలా మంది మమ్మలని వింతగా చూస్తున్నారు.
ఏంటి అలా చూస్తున్నారు అనుకొని కూడ ఆ మాములేకదా అని సరిపెట్టుకున్నాము. అక్కడొక బడి వుంది పిల్లలందరూ బయటకు రాకుండా లోపలనించే భయం, భయంగా చూస్తున్నారు. అంతలో ఆ బడి అయ్యవారు మా దగ్గరకు వచ్చి ఎవరు మీరు, ఎందుకు ఇక్కడున్నారు అని అడిగాడు ఈ ఊరు చూడాలనివచ్చాము అని చెప్పేసరికి ఇంకొంచం అనుమాణంగా చూసాడు. ఎంటబ్బా అంతా తేడాగా వుంది అనుకొని ఎందుకయినా మంచిది అని మా బందువుల ఇంటికి వెళ్ళాము. ఇలాంటి విశయాలలొ నా బుర్ర త్వరగానే పనిచేస్తుందిలే. నాకు వాళ్ళ ఇల్లు కూడా తెలియదు ఎలాగో కనుక్కొని వెళ్ళాం. ఒక ముసలావిడ వుంది ఇంట్లో, ఎవరు అని అడిగితే చెప్పాను, ఇక ఇద్దరికి శుభ్రంగా అన్నం పెట్టింది. అంతలో ఇంకొక ముసలావిడ వచ్చింది.
మా గురించి తెలుసుకొని, అయ్యో మీవాళ్ళేనా ఊర్లో అందరూ పిల్లలను ఎత్తుకెళ్ళేవాళ్ళనుకుంటున్నారు అంది. అప్పుడు తెలిసింది మాకు వాళ్ళ చూపులకి అర్దం. ఇంతలో ఇంకొక అబ్బాయి వచ్చాడు అతనికి విషయం తెలిసి ఇంత చేసింది ఆ ముసలదే అని చావుకబురు చల్లగాచెప్పాడు. అప్పుడు ఆ ముసలామె నాకేం తెలుసు ఎవరో వస్తే వాళ్ళే అనుకున్న అంది. మేము హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకోని బయలుదేరాం, వాళ్ళు వుండమన్నా వినకుండా. వచ్చేప్పుడు శీనయ్య నేను సైకిలు తొక్కుతానని తీసుకున్నాడు. అప్పుడే తిన్నాడు కాబట్టి మంచి వేగంగా పొతున్నాడు, పైగా అది పెద్దవాలు నెను ఊరికే కూర్చుంటే ఇంకేం, శీనయ్య ఒక్కసారి ఆ వాలు చూడు అన్నాను ఏది అని వెనకకు తిరిగి నన్ను పడేసాడు వాడికి వెనకకు తిరిగితే సైకిలు అదుపు చేయలేడు. చేతులు, కాళ్ళు దోక్కుపొయాయి. అలాగె ఇంటికి వచ్చి చేతులు, కాళ్ళు కడుక్కోని మళ్ళీ ఆటకు బయలుదేరాను.

కావలి చెరువు లో సుబ్బారావు
అది ఏప్రిల్ నెల ఎండాకాలం అయినా అప్పుడు మాకు కాలాలతో పనివుండేది కాదు. అందునా శనివారం. శనివారం అయితే ఏంటట అని మీరు అడగొచ్చు. కావలి చెరువులో చిన్న గుట్టపై నరశిం హ స్వామి గుడి వుండేది. పేరుకి గుడేకాని చాలా చిన్నది. దానికి ఒక పూజారి వుండేవారు. అతను మంచి వెలుగుతో చూస్తే బక్తి బావం కలిగేలా వుండేవారు. నుదిటిన విబూది రాసుకొని దానిపై ఎర్రటి పెద్ద నామం పెట్టేవారు. ఒక్క శనివారం మాత్రం అన్నదానం జరిగేది. అన్నదానం అంటే ఏదో అక్కడ బర్రెలు, గొర్రెలు కాసుకునే ఓ ఐదుగురు, ఆరుగురు వచ్చేవారు ఎందుకంటె అది ఊరికి దూరంగా వుండటమే కాకుండా పెద్ద గుడి కాదు. అందులో ఎప్పుడు టీ.వి ఇంకా బోలెడు పనుల్లో తీరిక లేని మన వాళ్ళకు అసలు అక్కడ ఒక గుడి వుంది అని తెలియదు. దానికే ఆ స్వామి ఓ ఎడ్లబండిలో ఊర్లన్ని తిరిగి, తిరిగి బియ్యం, డబ్బులు తీసుకొని ఆ తరువాతి శనివారం అన్నదాన కార్యక్రమం సజావుగా సాగించేవాడు. అది శనివారం కథ. అందుకే శనివారం బయలు దేరాం.
మళ్ళీ అక్కడ నించి ఇంటికి రావాలంటే ఆ ఎండలో నాలుగు కిలోమీటర్లు నడవాలి. అదీకాక మళ్ళీ ఇంట్లో వాళ్ళు పంపుతారో లేదో అని భయం. మొత్తానికి ప్రయాణం మొదలయ్యింది. నేను, శీనయ్య, మల్లిగాడు, ఇంకోకడి పేరు గుర్తు లేదు( సతీష్ ) అనుకుంటాను, చివరిగా మన కథానాయకుడు సుబ్బారావు. మేము 10 గంటలకు బయలుదేరి ఆడుతూ, పాడుతూ నడిచి వెళ్ళేసరికి మ 11:30 అయింది ఇంకా అన్నదాన కార్యక్రమం మొదలవలేదు. ఈలోపు పక్కనే వున్న జామాయిల్ తోటలో పడ్డాము. పిచ్చి పుట్టకొక్కులు అక్కడక్కడా వున్నాయి. అవి మాములువి కావు పెద్ద బంతిలా వుండి పసుపు రంగుతో నిండి వుంటాయి. తేలికగ పగిలి బోలెడు పసుపు రంగు వెదజల్లుతాయి. కిష్కిందలో కోతుల మూకలా ఆ జామాయిల్ తోటలో చెలరేగి పొయాము. ఎవరికి దొరికిన పుట్టకొక్కులు వాళ్ళు తీసుకొని ఒకరినొకరు కొట్టుకోవడం మెదలుపెట్టాం. అవి పగిలి ఒక్క నిమిషం అక్కడ ఏమి కనిపించేది కాదు. గుడ్డలు, మొహాలు పసుపుగా తయారయ్యాయి.
ఈ గొడవముగిసే సరికి అక్కడ అన్నదానం మొదలయ్యింది. అక్కడి బాయి (బావి) దగ్గరకు వెళ్ళి కాళ్ళూ, చేతులు శుభ్రంగా కడుక్కోని వెళ్ళి కూర్చున్నాం. అన్నం, దోసకాయ పచ్చడి, సాంబారు, మజ్జిగతో తిన్నాం. పాపం మా కోతి మూక దండెత్తుంది అని తెలియక ఎప్పటిలా వండారు ఏదొ సర్దుబాటు చేసుకొని కొంచం తిన్నాం, కాని తిండి విషయంలో మన కధానాయకుడు రాజీపడే అవకాశమే లేదు ఎలాగో సర్దుబాటుచేసాం. సుబ్బారావు కి చిన్నప్పుడే పోలియోసోకి ఒక కాలు సచ్చుబడిపొయింది, ఇంక వీపున గూని మాకంతే ఓ ఆరు ఏళ్ళు పెద్ద. మంచి హుషారుగా ఉండేవాడు. మొత్తానికి కడుపులు నిండాయి ఇంకేముంది కోతికి కల్లు ముంత దొరికినట్టు రెచ్చిపోయి దొరికిన చెట్టునల్లా ఎక్కి కిందకు జారేవాళ్ళం. దాహం మొదలయ్యింది పక్కనే వున్న టెలిఫొన్ ఎక్ష్చేంజిలో బోరింగు ఉంది. అక్కడకు వెళ్ళి కడుపునిండ నీళ్ళు తాగి పక్కనే వేపచెట్టుకింద కొంతసేపు కూర్చొన్నాం.
నాకు చెట్టుమీదున్న తేనెతుట్టి కనిపించింది ఊరికి ఉంటే మసుషులు అవుతాం కాని కోతులమెలా అవుతాం. వెంటనే ఓ రాయితో కొట్టి నేను, సుబ్బారావు, శీనయ్య వ్యతిరేకదిశలో పరుగెట్టాం. అది నా సలహా ఎన్నో సార్లు తేనెటీగలతో కుట్టించుకొని నేర్చుకున్న పాఠం. మేము మల్లిగాడిని బాగా కుట్టి వుంటాయి అని నవ్వుకుంటు కాసేపాగి వచ్చాము. అయితే వాడు నవ్వుకుంటూ కనిపించాడు నన్నేమి కుట్టలేదు అన్నాడు. అయ్యో పధకం పారలేదు అని, కొత్త పధకం వేసాను నేను అందరం ఒకే చోటనిలబడి రాయితో తేనెతుట్టీని కొట్టాలి ఆ తరువాత పారిపోవాలి అని. అందరు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. మళ్ళీ నేనే కొట్టాను అందరం పరుగుపెట్టాం అయితే మా అందరికన్నా ముందు వుంది ఎవరోచెప్పండి చూద్దాం ఆ సుబ్బారావు అన్న మాకంటే పది గజాలు ముందే పరిగెడుతున్నాడు. అయితే ఈసారి తేనెటీగలకు పట్టుదల పెరిగినట్టుంది వదలకుండ వెంటపడ్డాయి.
అలా పరిగెడుతూ మళ్ళీ జమాయిల్ తోటలో దూరాం. అక్కడ చెట్లు అన్నీకొట్టేశారు. మొదుల్లనుండి చుట్టూపిలకలతో గుబురుగా ఉన్నాయి ఇక పరిగెట్టలేక ఒక్కొకరు ఒక్కోచెట్టులో కూర్చొని చుట్టూ వున్న పిలకలను చెత్తోపట్టుకొని తేనెటీగలు దగ్గరకు రాకుండా ఊపుతున్నాం. అన్నీ వెళ్ళిపోయాయి ఓ రెండు తప్ప అవి పట్టువదలని విక్రమార్కులులా మల్లిగాడి చెట్టుపైనే తిరుగుతున్నాయి. అందరం బయటకు వచ్చాం మేము అరిచేలోపే మల్లిగాడు నవ్వుతూ బయటికి వచ్చాడు. వాడు బయటికి వచ్చీ, రాకముందే కసిగా వాడిని కుట్టి వెళ్ళాయి ఆ రెండు తేనెటీగలు. వాడు కుర్రో, మర్రో అంటూ అక్కడే కూర్చున్నాడు. నేను వెళ్ళి చూసేసరికి వాడిముక్కు వాచింది. బాగ కసిగా కుట్టినట్టున్నాయి అనుకొని. చూస్తే తేనెటీగల ముల్లు ( కొండి ) వాడి ముక్కుపై వుంది వాటి పగకు ప్రతీకగా. సరేఅని అది తీసాను, పక్కనే ఇంకొకటి అలా చాలా వున్నాయి. కుట్టింది రెండు తేనెటీగలు మరి ఇన్ని ముల్లు ఎలావున్నాయి. అప్పుడు అర్ధమయింది. వాడు ఇందాక అబద్దం చెప్పాడని అందరం ఒకటే నవ్వు మల్లిగాడు దొరికిపొయానే అని బుంగమూతి పెట్టుకున్నాడు. ఆ తరువాత వాడి కోపాన్ని, బాదని పోగొట్టడానికి కాసేపు ఐస్ బాయ్ ( దొంగా, పోలీస్ ) ఆడి సాయత్రం ఐదు గంటలకు ఇంటికి వెళ్ళాం.

Subscribe to:
Posts (Atom)