ఆరోజు సొడారం ( చోడవరం ) కాని అందరూ అలాగే పిలిచేవాళ్ళు, కావలి నించి 30 కిలోమీటర్లు ఉంటుంది అక్కడకు వేశాను పధకం. నాతోపాటు శీనయ్య వస్తానన్నాడు. ఇద్దరం కలసి ఓ అద్దెసైకిలు తీసుకొని బయలు దేరాము, ఆ ఊరికే వెల్లటానికి కారణం అక్కడ మా బందువులు ఉన్నారు. వాల్ల ఇంటికి వెళ్ళాలని కాదు కాని మా వాళ్ళు వున్నారని. మా వాళ్ళు ఎక్కువసేపు సైకిలు తొక్కడానికి కష్టపడేవాళ్ళు కాని నాకు బాగా అలవాటు కదా అందుకే సహజంగా నేనే తొక్కేవాడిని.
అయినా అప్పుడు ఆకలి, అలసట అసలు తెలిసేది కాదు. చేతిలో ఒక్క పైసా కూడా లేకుండా ప్రయాణాలు చేసేవాళ్ళం, జేబులో ఓ రెండు రూపాయలు వుంటే అసలు ఆ సంతోషమే వేరు. అన్ని ఊర్లు చూస్తూ మధ్యాహాన్నానికి చోడవరం చేరాము. నా దగ్గర రూపాయి వుంది. అక్కడ ఓ అంగడిలో బిస్కెట్లు కొన్నాము .ఆ అంగడిలో ఓ అమ్మయివుంది శీనయ్యా, నేను తనను చూస్తు అక్కడే ఉన్నాము. అప్పటికి మాకు అంతగా ప్రేమ అలాంటివి తెలీదు ఎదో, పుస్తకపఠనం, ఇంకా సినిమా పరిఙ్ఞానం మాకు కొంత ( అ ) ఙ్ఞానాన్ని కలిగించాయి. తను వింతగా చూసి వెళ్ళిపోయింది పల్లెల్లో అంతేలే అనుకొని ఓ పాత గుడి కనిపిస్తే అక్కడకు వెళ్ళి కాసేపు ఆశక్తిగా అంతా చూసి వస్తుంటే చాలా మంది మమ్మలని వింతగా చూస్తున్నారు.
ఏంటి అలా చూస్తున్నారు అనుకొని కూడ ఆ మాములేకదా అని సరిపెట్టుకున్నాము. అక్కడొక బడి వుంది పిల్లలందరూ బయటకు రాకుండా లోపలనించే భయం, భయంగా చూస్తున్నారు. అంతలో ఆ బడి అయ్యవారు మా దగ్గరకు వచ్చి ఎవరు మీరు, ఎందుకు ఇక్కడున్నారు అని అడిగాడు ఈ ఊరు చూడాలనివచ్చాము అని చెప్పేసరికి ఇంకొంచం అనుమాణంగా చూసాడు. ఎంటబ్బా అంతా తేడాగా వుంది అనుకొని ఎందుకయినా మంచిది అని మా బందువుల ఇంటికి వెళ్ళాము. ఇలాంటి విశయాలలొ నా బుర్ర త్వరగానే పనిచేస్తుందిలే. నాకు వాళ్ళ ఇల్లు కూడా తెలియదు ఎలాగో కనుక్కొని వెళ్ళాం. ఒక ముసలావిడ వుంది ఇంట్లో, ఎవరు అని అడిగితే చెప్పాను, ఇక ఇద్దరికి శుభ్రంగా అన్నం పెట్టింది. అంతలో ఇంకొక ముసలావిడ వచ్చింది.
మా గురించి తెలుసుకొని, అయ్యో మీవాళ్ళేనా ఊర్లో అందరూ పిల్లలను ఎత్తుకెళ్ళేవాళ్ళనుకుంటున్నారు అంది. అప్పుడు తెలిసింది మాకు వాళ్ళ చూపులకి అర్దం. ఇంతలో ఇంకొక అబ్బాయి వచ్చాడు అతనికి విషయం తెలిసి ఇంత చేసింది ఆ ముసలదే అని చావుకబురు చల్లగాచెప్పాడు. అప్పుడు ఆ ముసలామె నాకేం తెలుసు ఎవరో వస్తే వాళ్ళే అనుకున్న అంది. మేము హమ్మయ్య గండం గట్టెక్కింది అనుకోని బయలుదేరాం, వాళ్ళు వుండమన్నా వినకుండా. వచ్చేప్పుడు శీనయ్య నేను సైకిలు తొక్కుతానని తీసుకున్నాడు. అప్పుడే తిన్నాడు కాబట్టి మంచి వేగంగా పొతున్నాడు, పైగా అది పెద్దవాలు నెను ఊరికే కూర్చుంటే ఇంకేం, శీనయ్య ఒక్కసారి ఆ వాలు చూడు అన్నాను ఏది అని వెనకకు తిరిగి నన్ను పడేసాడు వాడికి వెనకకు తిరిగితే సైకిలు అదుపు చేయలేడు. చేతులు, కాళ్ళు దోక్కుపొయాయి. అలాగె ఇంటికి వచ్చి చేతులు, కాళ్ళు కడుక్కోని మళ్ళీ ఆటకు బయలుదేరాను.

No comments:
Post a Comment