అది ఏప్రిల్ నెల ఎండాకాలం అయినా అప్పుడు మాకు కాలాలతో పనివుండేది కాదు. అందునా శనివారం. శనివారం అయితే ఏంటట అని మీరు అడగొచ్చు. కావలి చెరువులో చిన్న గుట్టపై నరశిం హ స్వామి గుడి వుండేది. పేరుకి గుడేకాని చాలా చిన్నది. దానికి ఒక పూజారి వుండేవారు. అతను మంచి వెలుగుతో చూస్తే బక్తి బావం కలిగేలా వుండేవారు. నుదిటిన విబూది రాసుకొని దానిపై ఎర్రటి పెద్ద నామం పెట్టేవారు. ఒక్క శనివారం మాత్రం అన్నదానం జరిగేది. అన్నదానం అంటే ఏదో అక్కడ బర్రెలు, గొర్రెలు కాసుకునే ఓ ఐదుగురు, ఆరుగురు వచ్చేవారు ఎందుకంటె అది ఊరికి దూరంగా వుండటమే కాకుండా పెద్ద గుడి కాదు. అందులో ఎప్పుడు టీ.వి ఇంకా బోలెడు పనుల్లో తీరిక లేని మన వాళ్ళకు అసలు అక్కడ ఒక గుడి వుంది అని తెలియదు. దానికే ఆ స్వామి ఓ ఎడ్లబండిలో ఊర్లన్ని తిరిగి, తిరిగి బియ్యం, డబ్బులు తీసుకొని ఆ తరువాతి శనివారం అన్నదాన కార్యక్రమం సజావుగా సాగించేవాడు. అది శనివారం కథ. అందుకే శనివారం బయలు దేరాం.
మళ్ళీ అక్కడ నించి ఇంటికి రావాలంటే ఆ ఎండలో నాలుగు కిలోమీటర్లు నడవాలి. అదీకాక మళ్ళీ ఇంట్లో వాళ్ళు పంపుతారో లేదో అని భయం. మొత్తానికి ప్రయాణం మొదలయ్యింది. నేను, శీనయ్య, మల్లిగాడు, ఇంకోకడి పేరు గుర్తు లేదు( సతీష్ ) అనుకుంటాను, చివరిగా మన కథానాయకుడు సుబ్బారావు. మేము 10 గంటలకు బయలుదేరి ఆడుతూ, పాడుతూ నడిచి వెళ్ళేసరికి మ 11:30 అయింది ఇంకా అన్నదాన కార్యక్రమం మొదలవలేదు. ఈలోపు పక్కనే వున్న జామాయిల్ తోటలో పడ్డాము. పిచ్చి పుట్టకొక్కులు అక్కడక్కడా వున్నాయి. అవి మాములువి కావు పెద్ద బంతిలా వుండి పసుపు రంగుతో నిండి వుంటాయి. తేలికగ పగిలి బోలెడు పసుపు రంగు వెదజల్లుతాయి. కిష్కిందలో కోతుల మూకలా ఆ జామాయిల్ తోటలో చెలరేగి పొయాము. ఎవరికి దొరికిన పుట్టకొక్కులు వాళ్ళు తీసుకొని ఒకరినొకరు కొట్టుకోవడం మెదలుపెట్టాం. అవి పగిలి ఒక్క నిమిషం అక్కడ ఏమి కనిపించేది కాదు. గుడ్డలు, మొహాలు పసుపుగా తయారయ్యాయి.
ఈ గొడవముగిసే సరికి అక్కడ అన్నదానం మొదలయ్యింది. అక్కడి బాయి (బావి) దగ్గరకు వెళ్ళి కాళ్ళూ, చేతులు శుభ్రంగా కడుక్కోని వెళ్ళి కూర్చున్నాం. అన్నం, దోసకాయ పచ్చడి, సాంబారు, మజ్జిగతో తిన్నాం. పాపం మా కోతి మూక దండెత్తుంది అని తెలియక ఎప్పటిలా వండారు ఏదొ సర్దుబాటు చేసుకొని కొంచం తిన్నాం, కాని తిండి విషయంలో మన కధానాయకుడు రాజీపడే అవకాశమే లేదు ఎలాగో సర్దుబాటుచేసాం. సుబ్బారావు కి చిన్నప్పుడే పోలియోసోకి ఒక కాలు సచ్చుబడిపొయింది, ఇంక వీపున గూని మాకంతే ఓ ఆరు ఏళ్ళు పెద్ద. మంచి హుషారుగా ఉండేవాడు. మొత్తానికి కడుపులు నిండాయి ఇంకేముంది కోతికి కల్లు ముంత దొరికినట్టు రెచ్చిపోయి దొరికిన చెట్టునల్లా ఎక్కి కిందకు జారేవాళ్ళం. దాహం మొదలయ్యింది పక్కనే వున్న టెలిఫొన్ ఎక్ష్చేంజిలో బోరింగు ఉంది. అక్కడకు వెళ్ళి కడుపునిండ నీళ్ళు తాగి పక్కనే వేపచెట్టుకింద కొంతసేపు కూర్చొన్నాం.
నాకు చెట్టుమీదున్న తేనెతుట్టి కనిపించింది ఊరికి ఉంటే మసుషులు అవుతాం కాని కోతులమెలా అవుతాం. వెంటనే ఓ రాయితో కొట్టి నేను, సుబ్బారావు, శీనయ్య వ్యతిరేకదిశలో పరుగెట్టాం. అది నా సలహా ఎన్నో సార్లు తేనెటీగలతో కుట్టించుకొని నేర్చుకున్న పాఠం. మేము మల్లిగాడిని బాగా కుట్టి వుంటాయి అని నవ్వుకుంటు కాసేపాగి వచ్చాము. అయితే వాడు నవ్వుకుంటూ కనిపించాడు నన్నేమి కుట్టలేదు అన్నాడు. అయ్యో పధకం పారలేదు అని, కొత్త పధకం వేసాను నేను అందరం ఒకే చోటనిలబడి రాయితో తేనెతుట్టీని కొట్టాలి ఆ తరువాత పారిపోవాలి అని. అందరు ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. మళ్ళీ నేనే కొట్టాను అందరం పరుగుపెట్టాం అయితే మా అందరికన్నా ముందు వుంది ఎవరోచెప్పండి చూద్దాం ఆ సుబ్బారావు అన్న మాకంటే పది గజాలు ముందే పరిగెడుతున్నాడు. అయితే ఈసారి తేనెటీగలకు పట్టుదల పెరిగినట్టుంది వదలకుండ వెంటపడ్డాయి.
అలా పరిగెడుతూ మళ్ళీ జమాయిల్ తోటలో దూరాం. అక్కడ చెట్లు అన్నీకొట్టేశారు. మొదుల్లనుండి చుట్టూపిలకలతో గుబురుగా ఉన్నాయి ఇక పరిగెట్టలేక ఒక్కొకరు ఒక్కోచెట్టులో కూర్చొని చుట్టూ వున్న పిలకలను చెత్తోపట్టుకొని తేనెటీగలు దగ్గరకు రాకుండా ఊపుతున్నాం. అన్నీ వెళ్ళిపోయాయి ఓ రెండు తప్ప అవి పట్టువదలని విక్రమార్కులులా మల్లిగాడి చెట్టుపైనే తిరుగుతున్నాయి. అందరం బయటకు వచ్చాం మేము అరిచేలోపే మల్లిగాడు నవ్వుతూ బయటికి వచ్చాడు. వాడు బయటికి వచ్చీ, రాకముందే కసిగా వాడిని కుట్టి వెళ్ళాయి ఆ రెండు తేనెటీగలు. వాడు కుర్రో, మర్రో అంటూ అక్కడే కూర్చున్నాడు. నేను వెళ్ళి చూసేసరికి వాడిముక్కు వాచింది. బాగ కసిగా కుట్టినట్టున్నాయి అనుకొని. చూస్తే తేనెటీగల ముల్లు ( కొండి ) వాడి ముక్కుపై వుంది వాటి పగకు ప్రతీకగా. సరేఅని అది తీసాను, పక్కనే ఇంకొకటి అలా చాలా వున్నాయి. కుట్టింది రెండు తేనెటీగలు మరి ఇన్ని ముల్లు ఎలావున్నాయి. అప్పుడు అర్ధమయింది. వాడు ఇందాక అబద్దం చెప్పాడని అందరం ఒకటే నవ్వు మల్లిగాడు దొరికిపొయానే అని బుంగమూతి పెట్టుకున్నాడు. ఆ తరువాత వాడి కోపాన్ని, బాదని పోగొట్టడానికి కాసేపు ఐస్ బాయ్ ( దొంగా, పోలీస్ ) ఆడి సాయత్రం ఐదు గంటలకు ఇంటికి వెళ్ళాం.

No comments:
Post a Comment